ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు భారీ సినిమా ల్లో మంచు వారి హీరో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తన డ్రీం ప్రాజెక్ట్ మూవీ “కన్నప్ప” కోసం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఇండియా వైడ్ గా అనేకమంది స్టార్స్ ఈ మూవీ లో కనిపించనుండగా ఈ మూవీ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. అయితే ఈ మూవీ లో ప్రభాస్ కేవలం చిన్న క్యామియో రోల్ మాత్రమే చేస్తున్నాడని టాక్ వచ్చింది.
కానీ అంతకు మించే తనపై ట్రీట్ ఉంటుంది అని ఇపుడు బజ్ వినిపిస్తుంది. ఇలా తన స్క్రీన్ టైం దాదాపు 20 నిమిషాలు ఉంటుందని మొదట ఒక టాక్ రాగా ఇపుడు మరో సాలిడ్ అప్డేట్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. దీనితో కన్నప్ప లో ప్రభాస్ పై ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సాంగ్ ను ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ కంపోజ్ చేసినట్టు తెలిపారు. దీనితో ఈ మూవీ లో ప్రభాస్ చాలా లిమిటెడ్ గానే కనిపిస్తుంది అనుకుంటే కొన్ని ఊహించనివే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. మరి ప్రభాస్ లాంటి స్టార్ ను వీరు ఎలా హ్యాండిల్ చేశారు అనేది వేచి చూడాలి.