హీరో శ్రీకాంత్ సినిమా రీమేక్ లో హీరో గా ఆనంద్‌ దేవరకొండ

హీరో శ్రీకాంత్ సినిమా రీమేక్ లో హీరో గా ఆనంద్‌ దేవరకొండ

టాలీవుడ్‌ యంగ్ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో ఆనంద్‌ దేవరకొండ. విజయ్‌ దేవరకొండ కమర్షియల్‌ హీరోగా ప్రూవ్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఆనంద్ మాత్రం డిఫరెంట్‌ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తొలి సినిమాతోనే తాను కమర్షియల్‌ ఫార్ములా సినిమాల హీరోను కాదని ప్రూవ్‌ చేసుకున్నాడు.

పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన దొరసాని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఆనంద్‌ దేవరకొండ. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆనంద్‌ దేవరకొండకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. దొరసాని సక్సెస్‌ అవ్వటంతో ఆనంద్‌ దేవరకొండకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో.

తాజాగా యంగ్ హీరో ఓ పాత తెలుగు సినిమాను రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నాడట. పాత సినిమా అంటే బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల సినిమా ఏం కాదు. లేట్‌ 90లలో రిలీజ్‌ అయిన ఓ కమర్షియల్ డ్రామాను ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా మార్చి రూపొందించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

1997లో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన మంచి విజయం సాధించిన సినిమా తాళి. కామెడీ చిత్రాల దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంల తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు రీమేక్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కథా కథనాలను ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా, మార్పులు చేసి ఆనంద్‌ దేవరకొండ హీరోగా రూపొందించే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే కథ విన్న ఆనంద్‌ కూడా తాళి రీమేక్‌కు ఓకె చెప్పాడట. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడెవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.