‘ఆనందోబ్రహ్మ’ ట్రైలర్‌ రివ్యూ

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 anando brahma theatrical trailerటాలీవుడ్‌లో హర్రర్‌ కామెడీ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. ‘ప్రేమకథా చిత్రమ్‌’ తర్వాత హర్రర్‌ కామెడీ సినిమాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. కాని అందులో కొన్ని మాత్రమే సక్సెస్‌ అయ్యాయి. ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. తాజాగా అదే జోనర్‌లో వస్తున్న చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. తాప్సి ప్రధాన పాత్రలో నటించడం ఈ సినిమా ప్రత్యేకత. ‘గీతాంజలి’ చిత్రంలో హీరోగా నటించిన శ్రీనివాసరెడ్డి ఈ సినిమాలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. అన్ని సినిమాల్లో దెయ్యాలను చూసి మనుషులు భయపడుతూ ఉంటారు. కాని ఈ సినిమాలో మాత్రం మనుషులను చూసి దెయ్యాలు భయపడుతూ ఉంటాయి.

ఒక ఇంట్లో కొన్ని దెయ్యాలు తిష్టవేసుకుని ఉన్నాయి. ఆ ఇంటికి శ్రీనివాస్‌రెడ్డి అండ్‌ టీం ఎంట్రీ ఇస్తుంది. ఆ ఇంట్లో దెయ్యం ఉందనే విషయం గుర్తించి వారు ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతో దెయ్యాలు భయపడుతూ ఉంటాయి. ట్రైలర్‌తో ఈ విషయంను స్పష్టంగా చెప్పిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాపై అమితాశక్తిని కలిగించారు. ఇది మరో ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘గీతాంజలి’ అవుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌ మరియు షకలక శంకర్‌ల కామెడీ సినిమాకు హైలైట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో తాప్సి తెలుగులో మరోసారి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఆమె కోరిక తీరేనా చూడాలి.

మరిన్ని వార్తలు:

మధుప్రియ కాస్త ఓవర్‌గా రియాక్ట్‌ అయ్యింది

ఫిదా మూవీ ప్రివ్యూ.

‘సీతయ్య’ దర్శకుడు ఆత్మహత్య యత్నం