మధుప్రియ కాస్త ఓవర్‌గా రియాక్ట్‌ అయ్యింది

madhu priya over reaction with archana in NTR big boss show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బిగ్‌బాస్‌ షో ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి రెండు ఎపిసోడ్‌లతో ఎంతో ఆసక్తిని కలిగించిన షో నిర్వాహకులు మూడవ రోజు కూడా హౌస్‌మెంట్స్‌ ఆసక్తికర సంభాషణలతో నడిచింది. బుదవారం ఎపిసోడ్‌లో అందరిని ఆకట్టుకున్న అంశాలు మధుప్రియ, అర్చన వివాదం మరియు హరితేజ, ప్రిన్స్‌ల ఇష్యూ. ఈ రెండు ఇష్యూలతో నిన్నంత ఎపిసోడ్‌ అలా అలా సాగిపోయింది. మధప్రియ హోమ గుండం వద్ద కూర్చుని ఉండగా అర్చన వచ్చి హరితేజ కూర్చున్న ప్లేస్‌లో కూర్చోవాల్సిందిగా చెప్పింది. హోమం నుండి పొగ ఎక్కువ వస్తుంది కనుక హరితేజ కళ్లు బాగా ఎర్రగా అయ్యాయి అని కొంత సమయం స్థానం మారాల్సిందిగా అర్చన సూచించింది. 

దాంతో మధుప్రియ కాస్త ఓవర్‌గా రియాక్ట్‌ అయ్యి నాకు ఏమైనా పర్వాలేదా అంటూ సీరియస్‌ అయ్యింది. వెంటనే హరితేజను అక్కడ నుండి లేపి తన స్థానంలో కూర్చో బెట్టింది. దాంతో అర్చన ఎందుకు అంతగా రియాక్ట్‌ అవుతున్నావు అంటూ మధుప్రియను ప్రశ్నించింది. దాంతో మధుప్రియ ఏడ్చేసింది. ఆ తర్వాత అర్చన వచ్చి మధుప్రియను కూల్‌ చేసే ప్రయత్నం చేసినా కూడా కార్తీక వద్దకు వెళ్లి మళ్లీ ఇష్యూను రేజ్‌ చేసే ప్రయత్నం చేసింది. కార్తీక సర్ది చెప్పడంతో మధు ప్రియ కామ్‌ అయ్యింది. ఇక రెండవ ఇష్యూ విషయానికి వస్తే ఆదర్ష్‌, హరితేజు సరదా సంబాషణను ప్రిన్స్‌ కాస్త సీరియస్‌గా, వ్యక్తిగతంగా తీసుకోవడంతో వివాదం మొదలైంది. జోక్‌గా అనుకుని ప్రిన్స్‌ను హరితేజ తిట్టేసింది. అందుకు ప్రిన్స్‌ కూడా సీరియస్‌ అయ్యాడు. ఆ తర్వాత హరితేజ వెళ్లి ప్రిన్స్‌కు సారీ చెప్పింది. దాంతో వివాదం సమసిపోయింది. నేడు ఏం జరుగుతుంది అనేది చూడాలి.

మరిన్నివార్తలు

‘సీతయ్య’ దర్శకుడు ఆత్మహత్య యత్నం

పిక్‌టాక్‌ : ఎమ్మెల్యే లవర్‌ అదిరింది