పిక్‌టాక్‌ : ఎమ్మెల్యే లవర్‌ అదిరింది

kajal agarwal new look in MLA movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కాజల్‌ అగర్వాల్‌ అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అందెవేసిన చేయి. ఈ అమ్మడు ఇప్పటి వరకు ఎన్నో గ్లామర్‌ పాత్రలు చేసింది. అయితే తాజాగా రానాతో నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో పద్దతిగా ఒక మంత్రి భార్యగా నటించింది. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే ఇప్పుడు ఎమ్మెల్యే చిత్రంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో కాజల్‌ అందాలతో అదరగొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్న ఈ అమ్మడు ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. చీర కట్టులో కూడా అందాల ప్రదర్శణ చేస్తూ ఈమె సోషల్‌ మీడియాలో కుమ్మేస్తోంది. చీరలో షూట్‌లో పాల్గొన్న కాజల్‌ తాజాగా ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఆ ఫొటోపై మీరు ఒక లుక్కేయండి. 

మరిన్ని వార్తలు 

షాక్‌ : ‘నిన్నుకోరి’ 50 కోట్లు

ఆందోళనలో ఛార్మి.. హాజరు అయ్యేది అనుమానమేనా?

రాజుగారిగదిని నాగ్‌ బాహుబలి స్థాయిలో ఉండాలంటున్నాడు