షాక్‌ : ‘నిన్నుకోరి’ 50 కోట్లు

Nani ninnu kori movie reached in 50 crores club

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం టాలీవుడ్‌లో నాని హవా నడుస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వరుసగా ఏడు సినిమాలు సక్సెస్‌ కావడంతో నాని ప్రస్తుతం స్టార్‌ హీరో స్థాయిలో నిల్చున్నాడు. యువ హీరోల్లో నాని ఒక ప్రత్యేకమైన స్థానంను దక్కించుకున్నాడు. వరుసగా నాని సక్సెస్‌లు సాధిస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమా స్టార్స్‌ కూడా నానిని చూసి కుళ్లుకుంటున్నారు. టాలీవుడ్‌కు చెందిన అయిదు ఆరుగురు స్టార్‌ హీరోలు మాత్రమే 50 కోట్ల కలెక్షన్స్‌ను సాధించగుగుతున్నారు. కాని నాని మాత్రం వరుసగా 50 కోట్ల కలెక్షన్స్‌ను సాధిస్తూ అందరికి షాక్‌ ఇస్తున్నాడు. 

ఇటీవలే విడుదలైన ‘నిన్నుకోరి’ చిత్రం కూడా ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు 30 కోట్ల షేర్‌ను వసూళ్లు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రానికి పర్వాలేదు అనే టాక్‌ వచ్చినా కూడా ఈస్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టడం అందరికి షాకింగ్‌గా ఉంది. ఈ సినిమాను కేవలం క్లాస్‌ ఆడియన్స్‌ మాత్రమే ఆధరిస్తారని చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకున్నారు. స్వయంగా నాని కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. కాని షాకింగ్‌గా 50 కోట్ల గ్రాస్‌ను రాబట్టి షేక్‌ చేస్తుంది. ఈ చిత్రంతో నాని స్థాయి మరింతగా పెరిగింది. ఈ వారంలో కూడా నిన్నుకోరి చిత్రం మంచి వసూళ్లను రాబడుతూ దూసుకు పోతుంది.

మరిన్ని వార్తలు 

పూరి విచారణ పూర్తి.. సిట్‌ నిర్ణయం ఏంటి?

రాజుగారిగదిని నాగ్‌ బాహుబలి స్థాయిలో ఉండాలంటున్నాడు

చక్రిని చంపేసింది పూరినే..!!