రాజుగారిగదిని నాగ్‌ బాహుబలి స్థాయిలో ఉండాలంటున్నాడు

Nagarjuna Raju gari Gadhi 2 movie details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓంకార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దాంతో ఆ సినిమా మాదిరిగానే మరో హర్రర్‌ సినిమాను ఓంకార్‌ దర్శకత్వంలో చేసేందుకు నాగార్జున ముందుకు వచ్చాడు. ప్రముఖ నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి సినిమాను నిర్మిస్తున్నాడు. ‘రాజు గారి గది 2’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా రీ షూట్‌ కారణంగా ఒక సారి ఆలస్యం అయ్యింది. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్‌ సభ్యులు మరోసారి సినిమాను వాయిదా వేయడం జరిగింది.

ఇటీవలే రీ షూట్‌ను పూర్తి చేసిన ఓంకార్‌ ప్రస్తుతం గ్రాఫిక్స్‌ వర్క్‌ చేయిస్తున్నాడు. హర్రర్‌ సినిమా అవ్వడంతో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో గ్రాఫిక్స్‌ సినిమాకు చాలా కీలకం. దాంతో గ్రాఫిక్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా దర్శకుడు ఓంకార్‌ను నాగార్జున ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు ఓంకార్‌ చాలా జాగ్రత్తగా ఎక్కువ శ్రద్ద పెట్టి గ్రాఫిక్స్‌ను చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రంకు గ్రాఫిక్స్‌ చేసిన టీం ‘రాజుగారి గది 2’ చిత్రానికి వర్క్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి భారీ మొత్తానికి గ్రాఫిక్స్‌ కోసం ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రాఫిక్స్‌ ఆలస్యం కారణంగా సినిమాను అక్టోబర్‌కు వాయిదా వేశారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో సమంత నటిస్తుంది.

మరిన్ని వార్తలు 

చక్రిని చంపేసింది పూరినే..!!

హీరో కూతురు అందం కోసం ఆపరేషన్‌..!

మంచు వారి ఇంటకి మరో బుజ్జాయి