Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారతీయ జనతా పార్టీ నేతలు తమకు తాము మేధావుల్లా ఫీలవుతారో ఏమో ఎప్పుడు చూడు ఏదో ఒక పనికిమాలిన వ్యాఖ్య చేయడం వార్తలలో నిలవడం చేస్తున్నారు. రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తొలగించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు ఏడాది క్రితం అనుచిత వ్యాఖలు చేసిన కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే తాజాగా అటువంటివే మరలా రిపీట్ చేశాడు. హిందూత్వంపై వినాయక్ సావర్కర్ రాసిన పుస్తక కన్నడ అనువాద ప్రతిని ఆవిష్కరించిన ఆయన తర్వాత మాట్లాడుతూ అమ్మా నాన్న తెలియని వారే లౌకికవాదులమంటూ చెప్పుకుంటారని, లౌకిక మేధావులమని చెప్పుకునేవారు మూర్ఖులని వారి తెలివితేటలను విక్రయించుకుంటారని వారికి హిందూత్వంలోని గొప్పతనం అర్థం కాదని వ్యాఖ్యానించారు.
ఇక ప్రసార మాధ్యమాల్లో హిందువుల ఆరాధనను తిప్పికొట్టడం, మీడియాకు అలవాటు అయ్యిందని మీడియా నా గురించి మంచిగా మాట్లాడితే ప్రజలు ఆశ్చర్యపోతారు, వారు నన్ను తప్పుగా చూపించే పరిస్థితి సాధారణమైందని హెగ్డే పేర్కొన్నారు. హిందూమతం గొప్పతనాన్ని మీడియా తెలియజెప్పాలని… రాముడు, కృష్ణుడు బ్రాహ్మణులు కానప్పటికీ వారిని ప్రజలు ఆరాధిస్తున్నారని… లౌకిక మేధావులు హిందూత్వంలోని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు అనంతకుమార్ హెగ్డే.