నిర్మాతగా మారుతున్న అనసూయ

Anasuya becoming as a producer

అనసూయ భరద్వాజ్ పేరు తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్స్ చేసే కామెడీ కంటే అనసూయ కోసమే చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తనదైన యాంకరింగ్‌తో గుర్తింపు పొందిన అనసూయ ఆ క్రేజ్‌తోనే వరుసగా సినిమా అవకాశాలను పట్టేస్తోంది. అంతేకాదు గత ఐదేళ్లుగా ఈ  ప్రోగ్రామ్‌ను తనదైన యాంకరింగ్‌తో మెప్పిస్తూ రావడం అంత ఈజీ కాదు. కానీ ఆ పనిని అనసూయ ఎంతో ఈజీగా చేస్తోంది. ప్రస్తుతం అనసూయ..చిరంజీవి, కొరటాల శివ సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు యాంకర్‌గా, నటిగా ప్రూవ్ చేసుకున్న అనసూయ.. త్వరలో నిర్మాత అవతారం ఎత్తనున్నట్టు సమాచారం. భ‌విష్య‌త్తులో నిర్మాణంలోకి అడుగుపెట్ట‌నున్న‌ట్టు అన‌సూయ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం వెండితెర‌కే కాకుండా వెబ్‌సిరీస్‌కు కూడా తాను ప్రాధాన్య‌త‌ను ఇస్తాన‌ని, అందులో న‌టించేందుకు తాను సిద్ధ‌మేనంటూ అన‌సూయ చెప్పింది.  అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీ వేదిక‌గా తానా సంబ‌రాలు అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. మూడు రోజుల వేడుక‌ల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప‌లువురు రాజ‌కీయ‌, సినీ దిగ్గ‌జాలు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తానా స‌భ‌ల్లో పాల్గొన్న అన‌సూయ మీడియాతో మాట్లాడుతూ త‌న‌కు కూడా అంద‌రి న‌టుల్లానే ఇత‌ర సినీ ఇండ‌స్ట్రీల‌లో న‌టించాల‌ని ఉంద‌ని, అన‌సూయ అంటే కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌లకే ప‌రిమితం కాదని రుజువు చేసుకున్నాన‌ని, త‌న‌కు ఉన్న టాలెంట్‌తో ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌పై తానేంటో నిరూపించుకుంటాన‌ని, ఆ దిశ‌గా అనుగుణంగా త‌న అడుగులు ప‌డుతున్నాయ‌ని అన‌సూయ చెప్పుకొచ్చింది.