రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు ఖాయమట !

Political vibration in Telugu states in two years

తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ కన్నేసిందని విశ్లేషణలు వినిపిస్తున్న నేపద్యంలో అదే అర్ధం వచ్చేలాగా సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీకి అధికారం అసాధ్యం అనుకున్న త్రిపుర, అస్సాం, హర్యానా, మహారాష్ట్ర లో అధికారంలోకి వచ్చామని గుర్తు చేసిన ఆయన కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో ఆ పార్టీ నేతలు నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సంధర్భంగా మాట్లాడిన ఆయన ఏపిలో వైసీపీకి రాజకీయ ప్రత్యర్థి బీజేపీ అవుతుందని  రానున్న రోజుల్లో బీజేపీ జెండాలు ఎగరడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొడుకుని గెలిపించుకోలేక పోయాడని ఆయన విమర్శించారు. మరోవైపు కేసీఆర్ సైతం తన కూతురు కవితను నిజామాబాద్‌లో గెలిపించుకోలేక పోయారని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక సీటు కూడా రాదని ప్రచారం చేస్తే 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని, తెలంగాణలో పరిస్థితి ఏపలో కూడా రాబోతుందని అన్నారు.