సామాజిక బాధ్యతతో ప్రవర్తించిన అనసూయ

Anasuya To Turn Associate Director

యాంకర్‌ అనసూయ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తూ వస్తుంది. తాజాగా అనసూయ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఒక వీడియో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ట్విట్టర్‌లో అనసూయ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో కారు డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి మొబైల్‌లో వీడియో చూస్తూ ఉన్నాడు. ఇలా వీడియోలు చూసుకుంటూ కారు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు, ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ అనసూయ ట్విట్టర్‌ ద్వారా ట్రాఫిక్‌ పోలీసులను కోరింది.

వెంటనే స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు కారు వివరాలు తెలియజేయాలంటూ అనసూయను కోరడం జరిగింది. అందుకు అనసూయ ఆ కారు నెంబర్‌ మరియు ఆ కారును ఆమె ఏ సమయంలో, ఎక్కడ చూసింది అనే విషయాన్ని షేర్‌ చేసింది. అయితే అనసూయ చేసిన పనిని కొందరు తప్పుబడుతున్నారు. కారులో వీడియో చూసినంత మాత్రాన రాష్‌ డ్రైవింగ్‌ చేయడం లేదు కదా, అతడు చేసిన చిన్న తప్పుకు పెద్ద శిక్ష పడేలా అనసూయ ప్రవర్తించింది అంటూ సోషల్‌ మీడియాలో పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తనను విమర్శిస్తున్న వారిపై తనదైన శైలిలో అనసూయ విరుచుకు పడినది. కొన్నాళ్ల క్రితం బెంగళూరులో అనసూయ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్‌ అయ్యింది. అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుండి అంతా బయట పడ్డారు. అందుకే అనసూయ ఇలాంటి విషయాల్లో సీరియస్‌ అయ్యింది. కారును ట్రేస్‌ చేసి ఆ వ్యక్తికి జరిమానా విధించి, కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అనసూయను విమర్శిస్తున్న వారు ఉన్నారు, ఇదే సమయంలో అనసూయ సామాజిక బాధ్యతతో ప్రవర్తించింది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నవారు ఉన్నారు.