జలుబు వేధిస్తుందా ? ఇది ట్రై చేయండి !

Health Tips for Cold

తీవ్రమైన జలుబు మిమ్మల్ని వేధిస్తుంటే జామ పండు తింటే ఆ జలుబు సమస్య తీరుతుందట. జలుబుతో బాధపడేవారు జామ తినొద్దని అది జలుబు పెంచుతుందని చాలామంది చెబుతుంటారు, కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే జామలో జలుబును తగ్గించే లక్షణాలున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. తీవ్రమైన జలుబుతో బాధపడేవారు పెద్దసైజు జామకాయను తీసుకుని అందులో గింజలు తీసేసి తినాలి. తర్వాత గ్లాసు నీళ్లు తాగితే అది మందులా పనిచేసి గొంతులోనూ, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గిస్తోంది. దీంతో జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.