ఇప్పటివరకు బుల్లి తెర యాంకర్ గా విశేష ఆదరణ సంపాదించుకున్న అనసూయ, సినిమాల్లో తనదైన శైలి తో అదరగొడుతున్నారు. పాత్ర ఏదైనా, ఆ పాత్రకు తగ్గ న్యాయం చేయడానికి చాల శ్రమిస్తున్నారు. క్షణం, రంగస్థలం చిత్రాలతో అద్భుతం నటన కనబరిచిన అనసూయ చిత్ర పరిశ్రమ లో గుర్తుండే పాత్రలకు పెద్ద పీఠ వేసేలా కథలని ఎంచుకుంటున్నారు. అయితే అనసూయ ఇపుడు సరికొత్తగా ప్రతినాయకురాలి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
అర్జున్ రెడ్డి చిత్రం తో టాలీవుడ్ మనసు దోచుకున్న విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మీకు మాత్రమే చెప్తా అంటూ విజయ్ నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించారు. అయితే తాజాగా విజయ్ నిర్మించనున్న మరొక చిత్రంలో ప్రతినాయకురాలి పాత్ర కోసం విజయ్ అనసూయ ని సంప్రదించినట్లు సమాచారం. అల్లు అర్జున్- సుకుమార్ కాంబో లో నటిస్తున్న అనసూయ, పవన్- క్రిష్ కలయిక లో వస్తున్న pspk27 లో కూడా ఒక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.