ఎన్నికల ఫలితాలపై స్పందించిన అనసూయ

ఎన్నికల ఫలితాలపై స్పందించిన అనసూయ

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల ఫలితాలపై యాంకర్‌ అనసూయ స్పందించింది. నిన్న రాత్ర గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది. ఎలక్షన్స్‌ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ వరుస ట్వీట్లు చేసింది.

కాగా నిన్న జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందంటూ గతరాత్రి వార్తలు వైరల్‌ అయ్యాయి.అయితే ఎన్నికల అధికారి రిలీజ్‌ చేసిన మా విజేతల జాబితాలో అనసూయ పేరు లేకపోవడంతో ఆమె షాక్‌కి గురయ్యింది.