ఇళ్ల మీద కూలిన విమానం

ఇళ్ల మీద కూలిన విమానం

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. విమానం ఒకటి ఇళ్ల మీద కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో ఇళ్లతో పాటు.. పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఫాక్స్‌ ఐ సాన్‌ డియాగో రిపోర్ట్‌ ప్రకారం ఆరు సీట్ల ఎయిర్‌క్రాఫ్ట్‌ ట్విన్ -ఇంజిన్ సెస్నా 340, అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరింది. ఒక గంట తర్వాత కాలీఫోర్నియా చేరుకున్న విమానం.. ఉన్నట్టుండి అక్కడ ఉన్న ఇళ్ల మీద కూలిపోయింది.

ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోగా.. ఇద్దరు మరణించారు. పక్కనే ఉన్న డెలివరీ ట్రక్‌ కూడా పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.