ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

జనగామ జిల్లాలో మంగళవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. చిల్పూర్ మండలం కొండాపూర్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ సహా 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం హుస్నాబాద్ నుండి జగద్గిరిగుట్టకు బయలుదేరింది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో కొండాపూర్ సమీపిస్తుండగా గ్రామ శివారులో అదుపుతప్పి ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న చిల్పూర్ ఎస్ఐ మహేందర్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సహా స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. బస్సు బోల్తాపడి పూర్తిగా రోడ్డు కింద పడిపోయినప్పటికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.