నిర్మాణ సంస్థ: ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, సత్య, రాజా రవీంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
కళ: కృష్ణమాయ
కూర్పు: ఎం.ఆర్.వర్మ
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఏకే ఎంటర్ టైన్ మెంట్ తీసిన హ్యాట్రిక్ సినిమా అంధ గాడు. ఈదోరకం ఆడో రకం,కిట్టు వున్నాడు జాగ్రత్త తర్వాత మరోసారి రాజ్ తరుణ్ ప్రతిభ ని నమ్మి, రచయిత వెలిగొండ శ్రీనివాస్ కి దర్శకుడిగా అవకాశమిచ్చి చేసిన సినిమా అంధ గాడు. క్రేజీ కాంబో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ మరోసారి జంటగా వచ్చిన చిత్రం.ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.
కథ.
ఓ అంధ శరణాలయంలో స్నేహితులతో కలిసి ఉంటున్న గౌతమ్ కి తనకు చూపు కోసం చేయని ప్రయత్నం ఉండదు. అలా ఓ ప్రయత్నం చేస్తుండగా అసిస్టెంట్ కమిషనర్ కూతురు నేత్ర పరిచయం అవుతుంది. అయితే ఆమెకి తన అంధత్వం గురించి తెలియకుండా గౌతమ్ మేనేజ్ చేస్తుంటాడు. ఇది తెలియని ఆమె అతని ప్రేమలో పడుతుంది. కానీ గౌతమ్ మోసం చేస్తున్న విషయం ఆమె పసిగడుతుంది. అతనికి దూరంగా వెళ్ళిపోయినా అతనికి కళ్ళు రావడానికి సహాయపడుతుంది. ఇది తెలియని గౌతమ్ కళ్ళు వచ్చాక నేత్ర ని చూసి ఆమెని ప్రేమిస్తాడు. ఇది తెలిసి ఆమె మూగదానిలా నటిస్త్తుంది. ఓ వైపు వీళ్ళ వ్యవహారం నడుస్తుండగానే కళ్ళు వచ్చిన దగ్గరనుంచి గౌతమ్ జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది. అతని కళ్ళు కలల్లో పదేపదే ఓ కారుని చూస్తుంది. ఇక ఇంకో వ్యక్తి కారణంగా గౌతమ్ కొందర్ని మర్డర్ చేసిన కేసులో ఇరుక్కుంటాడు. గౌతమ్ కి అమర్చిన కళ్ళ వెనుక కధేమిటి? అతని ప్రేమ కధ ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే అంధ గాడు చూడాల్సిందే.
విశ్లేషణ.
రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నానికి ఎన్నుకున్న కధ కొత్తగా వుంది. అయితే లోతు ఎక్కువైన విషయాన్ని వినోదభరితంగా చెప్పేందుకు పూనుకున్న శ్రీనివాస్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కధకి ఆయువుపట్టు లాంటి ట్విస్ట్ లు,ఇతరత్రా కధనాన్ని నడపడంలో శ్రీనివాస్ గట్టి హోమ్ వర్క్ చేసాడు. అతని కి తోడుగా హీరో రాజ్ తరుణ్ కళ్ళు లేని పాత్రలో బాగా చేసాడు. కళ్ళు వచ్చాక ఎదురయ్యే సమస్యలు,కాస్త యాక్షన్ టచ్ వున్న పాత్రలో రాజ్ తరుణ్ సూపర్ అనిపించాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ పాత్ర సినిమాకి అదనపు బలం.ఇక ఏకే ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ విలువలు అహో అనేట్టు వున్నాయి.
ప్లస్ పాయింట్స్ .
ఫస్ట్ హాఫ్ లో వినోదం
నటీనటులు
కొత్త కధ
ఫోటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ .
ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ తగ్గినట్టు అనిపిస్తుంది.
తెలుగుబుల్లెట్ పంచ్ లైన్ . ‘అంధగాడు ‘ అలరిస్తాడు.