ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని అమరావతి గ్రామాల రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు 52వ రోజుకు చేరుకున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అయితే తాజాగా విశాఖ రైతులు కూడా జగన్ సర్కార్‌కి షాక్ ఇచ్చారు.
అయితే విశాఖలో ప్రభుత్వం చేపడుతున్న భూ సమీకరణలో భాగంగా తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. పద్మనాభం మండలం తునివలస పంచాయితీ నరసాపురం గ్రామంలో 181 ఎకరాల భూమిని సేకరించడానికి అధికారులు గ్రామ సభ నిర్వహించారు. అయితే తమకు ఇన్నేళ్ళు జీవనాధారంగా ఉన్న భూములను ఎక్కడికి వెళ్ళాలని నిలదీస్తూ, అధికారులు నచ్చచెప్పడానికి ప్రయత్నించిన రైతులంతా సభ నుంచి వెళ్ళిపోయారు.