ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు

ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు

ఇప్పుడు ఏపీలో రాజధాని అమరావతి తరలింపు విషయంలో ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు రగులుతున్న సంగతి అందరికి తెలిసిందే.అసలు ఎవరు ఊహించని విధంగా జగన్ మొదట ఒక మాట చెప్పి తర్వాత ఇలా ప్లేట్ తిప్పేస్తారని సాక్ష్యాత్తు వైసీపీ అభిమానులే ఊహించి ఉండరు.అలా ఈసారి జగన్ ను నమ్మి ఓటేసిన వారే మోసపోయాం అని తమ ఆవేదనను వెళ్లగక్కుతూ రాజధానిని మార్చవద్దు అంటూ వేడుకుంటున్నారు.

అయినప్పటికీ మాత్రం జగన్ నిర్ణయంలో ఎలాంటి మార్పులు లేవని వారు చెప్పకుండా కన్ఫర్మ్ చేసేసారు.అయితే అమరావతి విషయంలో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గట్టిగానే పోరాడుతుంది.అలా చేస్తున్న పోరాటంలో భాగంగా “కులాలకు, ప్రాంతాలకు అతీతంగా, ప్రజలు అమరావతిని కాపాడుకోవటానికి ముందుకు వస్తున్నారు. క్రైస్తవ సోదరీమణులు, అమరావతిని ఇక్కడ నుంచి తరలించవద్దు అంటూ, అమరావతిని రక్షించాలి అంటూ ఆ ప్రభువుని వేడుకుంటున్నారు.” అని తమ సోషల్ మీడియా ద్వారా చెప్తూ ఇప్పటికైనా సరే జగన్ కు బుద్ధి రావాలని కోరుకుందాం అంటూ సంచలన ట్వీట్ చేసారు.