సత్తా చాటిన ఏపీ… వెనుకపడ్డ తెలంగాణా !

Andhra Pradesh gets Top in ease of Doing Business Ranking

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తా చాటాయి. నిన్న పొద్దుపోయాక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇక హర్యానా, జార్ఖండ్, గుజరాత్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఏపీ 98.42 శాతం స్కోరుతో టాప్ పొజిషన్లో నిలవగా… తెలంగాణ 98.33 శాతం స్కోరుతో రెండో స్థానం నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 2016లో తెలుగు రాష్ట్రాలు రెండూ అగ్రస్థానంలో నిలిచాయి.

కానీ ఇప్పుడు ఏపీ పలు సంస్కరణలు చేసి పెట్టుబడులకి స్వర్గధామంగా మారడంతో తెలంగాణాని వెనుకకి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. 12 కీలక సంస్కరణలతోపాటు 405 అంశాల ఆధారంగా రూపొందించే ఈ జాబితాలో ఈ ఏడాది తెలంగాణ లేదా జార్ఖండ్ అగ్రస్థానంలో నిలుస్తాయని భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రాల ర్యాంకింగ్స్‌ను ప్రపంచ బ్యాంక్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ సంయుక్తంగా రూపొందిస్తాయి.

Andhra Pradesh gets Top in ease of Doing Business Ranking