హ్యాపీ వెడ్డింగ్‌కు ముహూర్తం ఫిక్స్‌

happy wedding movie release date fixed

సుమంత్‌ అశ్విన్‌, నిహారిక జంటగా లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మితం అయిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్‌’. ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుండి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం వైపు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదలకు రంగం సిద్దం అయ్యింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ మరియు టీజర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మన మొదటి సినిమాతో మంచి నటిగా మాత్రమే గుర్తింపు దక్కించుకున్న నిహారిక ఈ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోవడంతో పాటు, కమర్షియల్‌ హీరోయిన్‌గా కూడా పేరు తెచ్చుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

సినిమా ఇండస్ట్రీలో హీరోగా సుమంత్‌ అశ్విన్‌ ఎంట్రీ వరుసగా చిత్రాలు చేసుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్న ఈయనకు ఈచిత్రం కమర్షియల్‌ బ్రేక్‌ను ఇవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదలకు అధికారికంగా డేట్‌ను ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ‘సాహో’ వంటి బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌ను చేస్తున్న యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతున్న కారణంగా ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతో అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రం రికార్డు స్థాయిలో అమ్ముడు పోయింది. ఇదో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈనెల 28న పెద్దగా పోటీ లేని సమయంలో విడుదల కానున్న కారణంగా తప్పకుండా మంచి వసూళ్లు నమోదు అవుతాయని అంతా భావిస్తున్నారు.