ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి అమరావతిలో నిరసన సెగలు రగులుతున్నాయి. అమరావతిని తరలించడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన ఇపుడు అమరావతిలో నిరసనలకు కారణం అని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న సమయం లో శివాజీ ఇన్ సైడర్ ట్రేడింగ్ ఫై ఆసక్తికర విషయాలని వెల్లడించారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అని ఆరోపణలు చేయడం పట్ల శివాజీ స్పంgదిస్తూ, అలా చేసిన వారిపై ఆరోపణలు మాని ఎంక్వయిరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలి కానీ, ఇలా రాజధాని తరలించడం మంచి ఆలోచన కాదని అన్నారు. జగన్ స్వయంకృత అపరాధం చేస్తున్నారని అన్నారు. 30 వేల ఎకరాల రాజధాని ఉంటే దేశంలో నే అత్యద్భుతంగా తీర్చేదిద్దే అవకాశం వదులుకున్నారని అన్నారు. విశాఖపట్టణం లో 1000 ఎకరాల భూమి కూడా దొరకడం అసాధ్యం అన్నట్లుగా వ్యాఖ్యానించారు.