అమరావతి నిర్మాణం అసాధ్యం

అమరావతి నిర్మాణం అసాధ్యం

అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు జగన్ మూడు రాజధానులు రాష్ట్రానికి ఉండొచ్చు అని చేసిన వ్యాఖ్యలే అమరావతిలోని నిరసన సెగలకు కారణమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గం తో చర్చించిన పిదప కొన్ని కీలక విషయాలని వెల్లడించారట. రాజధాని తరలింపులో తొందర పాటు లేదని అన్నారట. ఏదైనా క్లియర్ గా ప్రజలకు చెప్పి చేయడం ఉత్తమం అని తెలిపారని సమాచారం.

అయితే ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం అసాధ్యం అని అన్నారట. లక్ష కోట్ల రూపాయల ఖర్చు తో ప్రభుత్వం నిర్మించలేదని తెలిపారు. అంతేకాకుండా లక్ష కోట్లలో పది శాతం విశాఖలో పెట్టిన దానిని హైదరాబాద్ కంటే ధీటుగా తయారుచేస్తామని తెలిపారట. అయితే రాజధాని విషయంలో సొంత మంత్రులు సైతం భిన్న అభిప్రాయాలను వెల్లడించారని సమాచారం. ఏదేమైనా రాజధాని అంశం ఫై అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి.