వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 12 గంటల సేపు విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం అర్ధరాత్రి దాటాక ఆయనని అరెస్ట్ చేశారు. దేశ్‌ముఖ్‌ను మంగళవారం ముంబై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి పి.బి.జాదవ్ ఆయనకు నవంబర్ 6 వరకు కస్టడీ విధించారు.
అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నెలకు రూ.100 కోట్ల వసూలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖకి లక్ష్యంగా నిర్ణయించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించడంతో దేశ్‌ముఖ్ రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే.