మన టాలీవుడ్ లో ఉన్నటువంటి అతి తక్కువమంది సక్సెస్ ఫుల్ దర్శకుల్లో వరుస హిట్స్ తో అపజయం ఎరుగని దర్శకునిగా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఒకరు. మరి తాను చేసిన అన్ని మూవీ లు ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇక ఈ మూవీ ల తర్వాత తాను చేసిన లేటెస్ట్ సినిమా నే “సంక్రాంతికి వస్తున్నాం”. వెంకీ మామ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా పై మంచి బజ్ ఇపుడు ఉంది.
ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తన మూవీ లు ఎలా చేస్తాడో చెప్పి అనీల్ రావిపూడి ఆశ్చర్యపరిచాడు. తన మూవీ మెయిన్ గా ఈ సంక్రాంతికి వస్తున్నాం అయితే కేవలం 72 రోజుల్లోనే చేసేసాం అని ఏ సీన్ అయినా కూడా ఇన్ని నిమిషాలు అనుకుంటే అన్ని నిమిషాలు మాత్రమే ఫుటేజ్ చేస్తామని సో ఫైనల్ గా ఎక్కువ మూవీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు.
ఇలా సంక్రాంతికి వస్తున్నాంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే కట్ చేసి 2 గంటల 22 నిమిషాలతో తీసుకొస్తున్నట్టుగా తెలిపారు. దీనితో తన పర్ఫెక్ట్ ప్లానింగ్ పరంగా సోషల్ మీడియాలో ఆడియెన్స్ నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు పలు మూవీ లు ఎన్నో గంటలు షూటింగ్ చేసుకొని మళ్ళీ అందులో ఒక గంట గంటన్నర ఫుటేజ్ లు డిలీట్ చేసుకునే కంటే ఇలా అనీల్ రావిపూడిలా ఎంతవరకు మూవీ అవసరమో అంతే చేసుకోవడం చాలా బెటర్ అని నెటిజన్స్ అంటున్నారు.