అనిమల్ రికార్డ్ ఓపెనింగ్ ఇండియాలో..!

అనిమల్ రికార్డ్ ఓపెనింగ్ ఇండియాలో..!
Cinema News

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా సినిమా “అనిమల్”. మరి పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా కాస్త మిక్స్డ్ స్పందనను అందుకుంది. అయినా కూడా ఈ సినిమా డే 1 మాత్రం వరల్డ్ వైడ్ సహా ఇండియాలో కూడా మంచి ఓపెనింగ్స్ ని అందుకోవడం విశేషం.

అనిమల్ రికార్డ్ ఓపెనింగ్ ఇండియాలో..!
Animal Movie

మరి ఈ సినిమా ఇండియాలో అయితే అన్ని భాషల్లో కలిపి 63 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా ఒక్క నార్త్ లో 54 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్నది . దీనితో ఈ సినిమా రణబీర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అంతే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా కి బ్రహ్మాస్త్ర కంటే మంచి ఓపెనింగ్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది . మొత్తానికి అయితే మళ్ళీ రణబీర్ తన కెరీర్ లో మంచి హిట్ ని స్కోర్ చేసాడని చెప్పుకోవచ్చు . .