ట్రంప్ బిగ్ షాక్. ఈ కేసులో విచారణ ఎదుర్కొవాల్సిందేనని ఫెడరల్ కోర్టు

Trump's big shock. The case should be tried in federal court
Trump's big shock. The case should be tried in federal court

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు షాక్ తగిలింది. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలను తారుమారు చేశారని అభియోగం ఎదుర్కొంటున్న కేసులో ట్రంప్​కు ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన అభియోగాలను కొట్టివేయాలని రిపబ్లికన్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫెడరల్‌ తిరస్కరించింది. మాజీ అధ్యక్షుడి హోదాలో ఎలాంటి రక్షణలు ఉండవని ఈ సందర్భంగా ఫెడరల్ కోర్టు జడ్జ్‌ తన్యా చుకుతాన్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ట్రంప్.. విచారణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేశారు.

పదవిలో ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు, నేరారోపణ, విచారణ, అభియోగాల నమోదు, దోషి, ఏదైనా నేరపూరిత చర్యలకు సంబంధించి శిక్ష విధించే విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుందని ఈ సందర్భంగా జడ్జి తన్యా చుకుతాన్ వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ మార్చిలో జరగనుండగా….తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్‌ వాదిస్తుండగా, అమెరికా అధ్యక్ష హోదాలో తీసుకున్న నిర్ణయమైనందున విచారణ నుంచి మినహాయిస్తూ ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. మరోవైపు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.