లాక్‌డౌన్ సమయంలో చాలా మంది హీరో, హీరోయిన్ల పెళ్లిళ్లు జరిగాయి. కొంతమంది చెప్పి చేసుకుంటే.. మరికొంత మంది రహస్యంగా పెళ్లి చేసుకొని షాకిచ్చారు. ఇంకొంత మంది రిలేషన్ షిప్‌లో ఉండి, పెళ్లి కోసం రెడీ అవుతున్నారు. ఇలా సినీ సెలెబ్రిటీలంతా పెళ్లి బాట పట్టడంతో అందరి చూపు ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌పై పడింది.
ఈ లిస్ట్‌లో హీరోయిన్ అంజలి కూడా ఉంది. ఈ తెలుగమ్మాయి ఈ ఏడాది చివరి నాటికి వివాహం చేసుకోబోతోందని పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై అంజలి స్పందించింది. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేసింది. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపై మాత్రమే ఉందని, రానున్న రోజుల్లో మంచి పాత్రలు పోషించాలని అనుకుంటున్నాను అని తెలిపింది.
ఇక సినిమాల విషయానికి వస్తే. .ఈ మధ్యనే ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని ఒక ప్రధాన పాత్రలో అంజలి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆమె హీరోయిన్ గా నటించిన ఆనందభైరవి తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు ఒక తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించబోతున్నట్లు సమాచారం.