దినకరన్ ఎత్తుకు పళని పైఎత్తు

anna-dmk-mlas-jumping-one-by-one-into-dinakaran-shelter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రోజురోజుకీ దినకరన్ బలం పెరుగుతోంది. ఎడపాడి శిబిరంలో కలవరం కలుగుతోంది. గతంలో పన్నీర్ శిబిరంలో రోజుకో ఎమ్మెల్యే చేరినట్లే.. ఇప్పుడు దినకరన్ శిబిరంలో ప్రతిరోజూ చేరికలు ఉంటున్నాయి.. ఈడ్రామాకు తెరదించాలని భావించిన పళని.. స్పీకర్ తో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇప్పించారు. వారు స్పందించలేదు కాబట్టి బలపరీక్షకు ముందే ఆ పంతొమ్మిది మందిపై వేటు పడుతుంది.

బలపరీక్షకు నలుగురు ఎమ్మెల్యేలు తగ్గినా.. దినకరన్ బ్యాచ్ పై వేటు వేయడం ద్వారా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గట్టెక్కాలని పళని స్వామి ఆలోచన. అటు పన్నీర్ సెల్వం కూడా తన వంతుగా ప్రభుత్వాన్ని కాపాడుకునే మార్గాలు వెతుకుతున్నారు. అసలు దినకరన్ లో ఏం చూసి ఎమ్మెల్యేలు అటువెళ్తున్నారో వీరిద్దరికీ అంతుబట్టడం లేదు.

అటు దినకరన్ మాత్రం తన ప్రయత్నాలు మానలేదు. కావాలనుకుంటే జయ చనిపోగానే సీఎం అయి ఉండేవాడినని డబ్బా కొడుతున్నాడు. మరోవైపు ఢిల్లీతో మైత్రి కోసం తహతహలాడుతున్నాడు. కానీ మోడీ మాత్రం దినకరన్ నీడను కూడా దగ్గరికి రానీయడం లేదు. మధ్యస్థాయి బీజేపీ నేతల్ని దినకరన్ దూతలు కలిసినా మా నేతలు ఆసక్తిగా లేరు పొమ్మన్నారట.

మరిన్ని వార్తలు:

లాలూ ర్యాలీలో ఆజాద్‌, మ‌మ‌త‌, అఖిలేశ్‌, శ‌ర‌ద్ యాద‌వ్‌

జ‌గ‌న్ ను డేరాబాబాతో పోల్చిన చంద్ర‌బాబు