డేరాలు ఉంటాయా.. ఊడతాయా..?

gurmeeth-ram-raheem-dera-sa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గుర్మీత్ రామ్ రహీమ్ కు ఏడేళ్ల నుంచి పదేళ్ల పాటు శిక్ష ఖాయం. ఇంకా డేరాలపై జరుగుతున్న విచారణలో కొత్త నేరాలు వెలుగుచూస్తే.. శిక్ష కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డేరాల్ని ఎవరు నడిపిస్తారనేది చర్చనీయాంశమైంది. ఏడేళ్లుగా బాబాకు సన్నిహితంగా ఉంటున్న హనీప్రీత్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నా.. 35 ఏళ్ల గురు బ్రహ్మచారి విపాసన కూడా రేస్ లో ఉంది.

గుర్మీత్ కు పెళ్లైందని, హనీప్రీత్ ఆయన కూతుళ్లలో ఒకరని చెబుతున్నా.. ఆ విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. అసలు డేరాలు ఖాళీ చేయించాలని కోర్టు ఆదేశించినప్పుడు ఇంక డేరాలేముంటాయనేది వ్యతిరేకుల వాదన. ఏదేమైనా సిర్సా ఆశ్రమం మాత్రం ఖాళీ అవుతోంది. ఈ లెక్కన గుర్మీత్ తోనే డేరా సామ్రాజ్యం అంతమైనట్లే.

ఓవైపు పంజాబ్, మరోవైపు హర్యానా రాష్ట్రాలు తమ భూభూగాల్లో డేరాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇదే అదనుగా గుర్మీత్ అంటే ఇష్టం లేని సిక్కు అధికారులు రెచ్చిపోతున్నారు. ఎలాగైనా డేరాలను మూసేయాలని కంకణం కట్టుకున్నారు. మరి ఎవరేం చేస్తారనేది కోర్టు తీర్పు తర్వాతే తేలనుంది.

మరిన్ని వార్తలు:

భూసర్వే కోసమే సిట్టింగుల మంత్రం

వివాదల పుట్టకే ప్రమోషన్లా మోడీ