వివాదల పుట్టకే ప్రమోషన్లా మోడీ

smriti-irani-to-take-charge-as-ib-minister

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్ర క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందని అందరికీ తెలుసు. మంత్రుల రాజీనామాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో వాయిదా పడుతూ వచ్చిన విస్తరణ.. ఇక ఆలస్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే రెండు మిత్రపక్షాలు అన్నాడీఎంకే, జేడీయూ కూడా కాచుకున్నాయి. వాళ్ల కోసమైనా విస్తరణ తప్పనట్లే. మరి ఎవరికి ప్రమోషన్లు, ఎవరికి డిమోషన్లు అనే విషయంలో హస్తినలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

వివాదాస్పద మంత్రిగా పేరు పడ్డ స్మృతి ఇరానీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందనే మాటే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. మానవ వనరుల మంత్రిగా పనిచేసి, తప్పుడు డిగ్రీలు చెప్పుకుని కేంద్రానికి చెడ్డపేరు తెచ్చిన ఆమెనే.. మళ్లీ సమాచార ప్రసార శాఖ మంత్రిగా నియమిస్తారని తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని వివాదాలొచ్చినా స్మృతిపై మోడీ అభిమానమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే సెన్సార్ బోర్డ్ మాజీ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ స్మృతిపై బురద జల్లి పోయారు. ఇక గతంలో వెంకయ్య చేసిన నియామకాల్ని కూడా ఆమె సమీక్షిస్తున్నారు. పైగా తానేదో ఫైర్ బ్రాండ్ అన్నట్లుగా తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటున్నారు. అలాంటి వ్యక్తికి సమాచార ప్రసార శాఖ ఇస్తే.. ఉన్నవి, లేనివి చెప్పి మోడీని కూడా ముంచుతారని విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

లాలూ ర్యాలీలో ఆజాద్‌, మ‌మ‌త‌, అఖిలేశ్‌, శ‌ర‌ద్ యాద‌వ్‌

జ‌గ‌న్ ను డేరాబాబాతో పోల్చిన చంద్ర‌బాబు