హమాస్‌కు మద్దతుగా ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. బాబ్-ఎల్-మండెబ్ జలసంధి దగ్గర లైబీరియా జెండాతో ఉన్న నౌక ఎంస్ఎస్సీ పలాటియం -3పై క్షిపణి దాడి జరిగింది. ఫలితంగా అందులో మంటలు చెలరేగాయి. దీనివల్ల నౌకలోనివారికి గాయాలయ్యాయా అన్నది వెల్లడికాలేదు. అంతకుముందు ఎంఎస్ఈ అలన్య అనే మరో షిప్పైక్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగింది. ఇందులో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. జర్మనీకి చెందిన హపాంగ్-లాయిడ్ సంస్థ ఈ నౌకను నిర్వహిస్తోంది. ఈ రెండు దాడులను చేపట్టింది తామేనని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రంలో తమ నౌకాయానాలను నిలిపివేస్తున్నట్లు డెన్మా ర్క్కు చెందిన షిప్పింగ్ కంపెనీ మార్స్క్ ప్రకటించింది.
జెరూసలేం పైకి రాకెట్లు
దాదాపు 45 రోజుల తర్వాత జెరూసలేం పై ఆరు రాకెట్లను ప్రత్యర్థులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వీటిలో మూడింటిని గాల్లోనే కూల్చేశామని పేర్కొంది. మిగతావి నిర్జన ప్రదేశాల్లో పడ్డాయని తెలిపింది. అక్టోబరు 30 తర్వా త ఈ నగరంపై దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో జెరూసలేంల్లో సైరెన్లు మోగాయి.