ఇండిగో ఫ్లైట్లో మరో ఘటన.. విమానంలో పక్కనే కూర్చున్న మహిళతో..!

ఇండిగో ఫ్లైట్లో మరో ఘటన.. విమానంలో పక్కనే కూర్చున్న మహిళతో..!
Crime

విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మహిళల పట్ల కొందరు తోటి ప్రయాణికులు వ్యవహరిస్తున్న తీరు సరిగా ఉండట్లేదు . తాజాగా ముంబై నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్లో ఇలాంటి ఘటననే చోటుచేసుకుంది . ఇండిగో సంస్థకు చెందిన ఫ్లైట్ ముంబై నుంచి గౌహతికి బయలుదేరిపోయింది . విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ మహిళా ప్రయాణికురాలు..

ఇండిగో ఫ్లైట్లో మరో ఘటన.. విమానంలో పక్కనే కూర్చున్న మహిళతో..!
Indigo Flight

లైట్స్‌ ఆఫ్‌ చేసి నిద్రపోయింది. అదే అదునుగా పక్క సీట్లో కూర్చున్న ఒక కేటుగాడు సదరు మహిళా ప్యాసింజర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిద్రపోతున్న ఆమెపై చేతులు వేసి అసభ్యకరంగా వ్యవహరించాడు . తొలుత అనుకోకుండా చేయి తగిలి ఉంటుందని ఆమె అనుకునది . ఆ తర్వాత కూడా అతను అలాగే ప్రవర్తించడంతో గట్టిగా గట్టిగా అరుస్తూ లైట్స్‌ ఆన్‌ కూడా చేసింది. అనంతరం ఆ వ్యక్తిపై అక్కడున్న సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఫ్లైట్ గౌహతి ఎయిర్పోర్టుకు చేరుకున్న వెంటనే ఎయిర్ లైన్స్ సిబ్బంది సదరు వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేసారు . గత రెండు నెలల వ్యవధిలో ఇండిగో విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది నాల్గోసారి కావడం అని అర్ధం అవుతుంది .