నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “హాయ్ నాన్న” తన కెరీర్ మరో మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఎప్పుడూ కూడా కొత్త కొత్త సబ్జెక్టు లతో అలరించే నాని ఈ మూవీ తర్వాత తన కెరీర్ 31వ మూవీ ని అయితే దర్శకుడు వివేక్ ఆత్రేయతో అనౌన్స్ చేసాడు. మరి ఆ సినిమా నే “సరిపోదా శనివారం”. అనౌన్సమెంట్ వీడియో తోనే సాలిడ్ బజ్ ని రేపిన ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో తెరకెక్కుతుంది.
అయితే ఈ మూవీ ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారని మేకర్స్ ఒక డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నట్టుగా బజ్ వచ్చింది. మేకర్స్ ముందుగా అయితే ఆగస్ట్ 15 డేట్ ని లాక్ చేసారని రూమర్స్ వచ్చాయి. అయితే ఆ డేట్ లో ఉన్న భారీ మూవీ “పుష్ప 2” ఒకవేళ రాకపోతే ఆ డేట్ ను లాక్ చేసుకోగా ఒకవేళ పుష్ప 2 వస్తే మరో రిలీజ్ డేట్ ని అనుకుంటున్నారట. అదే ఆగష్టు 29 కి ఫిక్స్ చేశారట. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ కూడా రావాల్సి ఉంది.