దేవర మూవీ నుంచి ఇంకో సాంగ్ వచ్చేసింది ….!

Another song from Devara movie is here....!
Another song from Devara movie is here....!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా ‘దేవర’ నుంచి దావూదీ సాంగ్ ఎట్టకేలకి రిలీజ్ అయ్యింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా లో ‘దావూదీ’ సాంగ్‌తో ఎన్టీఆర్ డ్యాన్స్ తో విశ్వరూపం చూపించబోతున్నాడని చిత్ర యూనిట్ గతకొద్ది రోజులుగా హైప్ క్రియేట్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ పాటకి సంబంధించిన వీడియో సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.

రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ డ్యుయెట్ సాంగ్‌లో తారక్ తన డైనమిక్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇక అందాల భామ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో అదరహో అనపించేలా ఉన్నది . అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన మాస్ బీట్స్.. దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్, జాన్వీ కలిసి చేసిన డ్యాన్స్‌తో ఈ పాట రాకింగ్‌గా అనిపిస్తుంది. విజువల్‌గా ఈ పాట బాగా అదిరిపోయిందని అభిమానులు చెబుతున్నారు

Another song from Devara movie is here....!
Another song from Devara movie is here….!

మొత్తంగా ‘దావూదీ’ సాంగ్‌తో తారక్ ఈ మూవీ పై అంచనాలని మరింత పీక్స్‌కి తీసుకెళ్లాడని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ ను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా ‘దేవర’ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.