నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్‌లో అర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (Arcelor Mittal Nippon Steel India Limited in Nakkapalli APIIC SEZ) ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లక్ష 35 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల వార్షిక స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.