“పుష్ప 2” నుంచి మరో ట్విస్ట్.. ఇప్పుడు ఇంకో క్లారిటీ వస్తుంది!

Another twist from “Pushpa 2”... Now comes another clarity!
Another twist from “Pushpa 2”... Now comes another clarity!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా హిట్ సినిమా “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి హిందీ మార్కెట్ లో సరికొత్త లెక్కలు చూపించిన ఈ మూవీ సెన్సేషన్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తాలూకా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లు బయటకి రావడం జరిగింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాలిడ్ ట్యూన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో రూల్ చేస్తున్నాయి.

Another twist from “Pushpa 2”... Now comes another clarity!
Another twist from “Pushpa 2”… Now comes another clarity!

అయితే ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే కాకుండా కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ కూడా వర్క్ చేసాడు. అయితే మూవీ లో ఎవరెవరు ఏ స్కోర్ అందించారు అనేది ఇపుడు తేటతెల్లం కానుంది అని చెప్పాలి. రీసెంట్ గానే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ వస్తే సామ్ సి ఎస్ కూడా ఇపుడు తన వెర్షన్ పుష్ప 2 ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను వదలబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. దీనితో పుష్ప 2 లో ఎవరెవరు ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అనేది ఒక కొలిక్కి రానుంది అని చెప్పొచ్చు . ఇక ఈ ఓఎస్టి ఎప్పుడు వస్తుంది అనేది డేట్ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉన్నది .