బాలయ్యతో పాటు మరో యంగ్ హీరో ?

Another young hero along with Balayya?
Another young hero along with Balayya?

బోయపాటి శ్రీను – బాలయ్య బాబు కాంబినేషన్‌ లో అఖండ 2’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ స్క్రిప్ట్ పనుల్లో బోయపాటి బిజీగా ఉన్నారు . ఐతే, స్క్రిప్ట్ దాదాపు ఫినిష్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ లో నటించే నటీనటుల పై కొత్తగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ మూవీ లో నటిస్తున్నాదంట .

Another young hero along with Balayya?
Another young hero along with Balayya?

దర్శకుడు బోయపాటి శ్రీను, విశ్వక్ సేన్ కోసం ఒక స్పెషల్ రోల్ రాశాడని.. సెకండ్ హాఫ్ లో ‘విశ్వక్ సేన్’ పాత్ర వస్తోందని తెలుస్తోంది. బాలయ్యకి విశ్వక్ సేన్ సన్నిహితంగా ఉంటారు . మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉన్నా.. మూవీ పై అంచనాలు రెట్టింపు అవుతాయి. ఇక కథ ప్రకారం.. మూవీ పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అన్నట్టు ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది.