అంత‌రిక్షం 9000 KMPH – డిసెంబ‌ర్ 21

Varun Tej Antariksham 9000kmph Movie Release Postponed

న‌టీన‌టులు:
వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద్రీ, స‌త్య‌దేవ్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల త‌దిత‌రులు
ద‌ర్శ‌కుడు: స‌ంక‌ల్ప్ రెడ్డి
స‌మ‌ర్ప‌కులు: క‌్రిష్ జాగ‌ర్ల‌మూడి
నిర్మాత‌లు: క‌్రిష్ జాగ‌ర్ల‌మూడి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి
సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్
సినిమాటోగ్ర‌ఫ‌ర్: జ‌్ఞాన‌శేఖ‌ర్ విఎస్
ఎడిట‌ర్: కార్తిక్ శ్రీ‌నివాస్
సంగీతం: ప‌్ర‌శాంత్ విహారి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్: స‌బ్బాని రామ‌కృష్ణ మ‌రియు మోనిక‌
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫ‌ర్: టాడ‌ర్ పెట్రోవ్ లాజారోవ్
సిజీ: రాజీవ్ రాజ‌శేఖ‌రన్

అంత‌రిక్షం 9000 KMPH - డిసెంబ‌ర్ 21 - Telugu Bulletవ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న తొలి తెలుగు స్పేస్ థ్రిల్ల‌ర్ ‘అంత‌రిక్షం 9000 KMPH’ . ఇందులో వ‌రుణ్ తేజ్ వ్యోమ‌గామిగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదు. ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి గ‌తేడాది ఘాజీ సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్నాడు. మ‌రోసారి కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తూ.. అంత‌రిక్షం 9000 KMPH సినిమాతో మన ముందుకు వ‌స్తున్నాడు. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తున్నారు. ఈ సినిమాలో అదితిరావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ తో క‌లిసి ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 21న అంత‌రిక్షం 9000 KMPH విడుద‌ల కానుంది.