మళ్లీ నిరాశే మిగిలింది..పాపం అను అను ఎమాన్యూల్‌

Anu Emmanuel Got Another Flop With Allu Arjun Na Peru Surya Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కళ్యాణ్‌ సరసన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించే అవకాశం రావడంతో తానో స్టార్‌ హీరోయిన్‌ అయిపోవడం ఖాయం అని అను ఎమాన్యూల్‌ భావించింది. కాని ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో స్టార్‌ హీరోయిన్‌ సంగతేమో కాని అవకాశాలే గగనం అయ్యాయి. అజ్ఞాతవాసి కంటే ముందే కమిట్‌ అయిన ‘నా పేరు సూర్య’ చిత్రంపై అను చాలా అంటే చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం సక్సెస్‌ అయితే తెలుగులో కనీసం ఓ అయిదు ఆరు సినిమాల్లో అయినా ఆఫర్లు వస్తాయి. అందులో ఒకటి రెండు సక్సెస్‌ అయినా కొంత కాలంగా తెలుగు హీరోయిన్‌గా కొనసాగవచ్చు అని భావించింది. కాని ఫలితం తారు మారు అయ్యింది. 

‘నా పేరు సూర్య’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక పోస్టర్‌లో మరియు టీజర్‌లో ఎక్కువగా కనిపించిన అను ఎమాన్యూల్‌ సినిమాల్లో అసలు లేకుండా పోయింది. పాటలకు మాత్రమే అను పరిమితం అవ్వడంతో ప్రేక్షకులు నిరాశ పడుతున్నారు. సినిమా సక్సెస్‌ కాకపోవడంతో అను ఎమాన్యూల్‌ను ఐరెన్‌ లెగ్‌ అంటూ కొందరు కొందరు ఎద్దేవ చేస్తున్నారు. మొత్తానికి అను ఎమాన్యూల్‌ ఈ చిత్రంతో అయినా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అవ్వాలని భావించి నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఈమె గోపీచంద్‌తో ఒక చిత్రాన్ని చేస్తుంది. ఆ సినిమాపై కూడా పెద్దగా ఆశలు లేవు. ఇక ఈమె ఇటీవల కమిట్‌ అయిన సినిమా తాజా ఫలితంతో క్యాన్సిల్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అను ఎమాన్యూల్‌ తెలుగులో స్టార్‌ హోదాను దక్కించుకోవడం కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ నిరాశే మిగిలింది..పాపం అను అను ఎమాన్యూల్‌ - Telugu Bullet