తెలుగు సినీ పరిశ్రమ లో అనుష్క ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ మరియు గోపీ చంద్ లాంటి హీరోల సరసన సరిగ్గా సెట్ అయ్యే హీరోయిన్ అనుష్క అని చెప్పాలి. అయితే గోపీచంద్ తన నెక్స్ట్ మూవీ అలిమేలుమంగ వెంకట రమణ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం చిత్త యూనిట్ ఇప్పటికే కాజల్ అగర్వాల్ మరియు కీర్తి సురేష్ లను తీసుకోవాలని భావించిన ఇంకా సెట్ అవ్వలేదు.
అయితే ఇప్పుడు తెరపైకి కొత్తగా అనుష్క పేరు వచ్చింది. కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉండటం తో అనుష్క ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ విన్న అనంతరం అనుష్క ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ అనుష్క ఈ చిత్రంలో నటిస్తే వీరిద్దరీ జంట మరొకసారి హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.