మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలకు కూడా ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వేవాటిలో ఒకటి తమిళ మూవీ ‘వేదాళం’ కాగా ఇంకొకటి మలయాళ చిత్రం ‘లూసిఫర్’. ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ పూర్తిగాగానే వాటిని పట్టాలెక్కించబోతున్నాడు. గతడేది మలయాళంలో విడుదలైన ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చయనున్నారు.
ఇప్పటికే ఈ మూవీ రైట్స్‌ను రామ్‌చరణ్ సొంతం చేసుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించనున్న ఈ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్లు మార్పులు చేయనున్నారు. ఇక ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం చాలామంది స్టార్ హీరోయిన్లు పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిరుకు చెల్లిగా అనుష్క శెట్టిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో మూవీ టీం సంప్రదింపులు జరిపినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.