అరుంధతికి ముందు… అనుష్క షాకింగ్‌ వ్యాఖ్యలు

anushka-senastinal-comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలుస్తున్న అనుష్క తాజాగా ‘భాగమతి’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఒక మీడియా సమావేశంలో అనుష్క మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరికి షాక్‌ ఇచ్చింది. తాను సినిమాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు, వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లకే సినిమాల నుండి వెళ్లి పోయాను అంటూ చెప్పుకొచ్చింది.

అనుష్క ఇంకా మాట్లాడుతూ.. నాగార్జున ‘సూపర్‌’ చిత్రంలో తాను ఆసక్తి లేకుండానే నటించాను. ఆ తర్వాత కూడా ఆఫర్లు వస్తున్నా కూడా ఆసక్తి లేకుండానే చేశాను. సినిమాలు మానేయాలని భావించిన తరుణంలో ‘అరుంధతి’ చిత్రం కథ నా వద్దకు వచ్చింది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని సినిమాలు మానేస్తే అప్పుడు బాగుంటుందని అనుష్క భావించిందట. అందుకే ‘అరుంధతి’ చిత్రాన్ని చేసి ఆ తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని భావించిందట. కాని అరుంధతి చిత్రంలో నటించిన తర్వాత సినిమాలే ప్రపంచంగా బతికేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పుకొచ్చింది.

అరుంధతి ముందు వరకు సినిమా ఇండస్ట్రీ నుండి ఎప్పుడెప్పుడు పారిపోదామా అనిపించింది. కాని అరుంధతి చిత్రంతో నాలో తెలియని మార్పు వచ్చింది. అరుంధతి చిత్రంలో తాను నటించకుంటే ఆ తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పేదాన్ని అని, ఇంతటి గుర్తింపు వచ్చేది కాదు అంటూ అనుష్క పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంది.