సేమ్‌ డే రిలీజ్‌.. ఎవరికి నష్టం?

Sai-Dharam-Tej-Intelligent-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

స్టార్‌ హీరోల సినిమాలు ఒకే రోజు రెండు విడుదల అయితే ఓపెనింగ్స్‌ విషయంలో ఇద్దరు హీరోలకు నష్టమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల ఫలితాలను బట్టి తర్వాత కలెక్షన్స్‌ ఉంటాయి. అయితే మొదటి రెండు మూడు రోజులు మాత్రం స్టార్‌ హీరోల సినిమాలకు వచ్చే భారీ కలెక్షన్స్‌పై దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు ఒకేరోజున విడుదల చేసేందుకు ఆసక్తి చూపించరు. మొదటి సారి మెగా హీరోల రెండు చిత్రాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్‌కు ఎదురు కాని పరిస్థితి ఇది. మెగా ఫ్యాన్స్‌ ఈ విషయంలో కాస్త ఆందోళనలో ఉన్నారు.

ఫిబ్రవరి 9న పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వాటిల్లో మెగా హీరోలకు చెందిన ‘తొలిప్రేమ’ మరియు ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాలు కూడా ఉన్నాయి. కాకతాళియంగా జరిగిందో లేక కావాలని చేస్తున్నారో కాని మెగా మూవీలు రెండు ఒకే రోజు వస్తున్నాయి. ఇలా రెండు ఒకే రోజు రావడం వల్ల ఇద్దరు హీరోలకు నష్టమే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు సినిమాలు సక్సెస్‌ అయితే తప్పకుండా రెండు కూడా మంచి కలెక్షన్స్‌ను సాధిస్తాయి. రెంటిలో ఏ ఒక్కటి ఫ్లాప్‌ అయ్యి, మరో సినిమా సక్సెస్‌ అయితే సక్సెస్‌ అయిన సినిమాకు ఖచ్చితంగా భారీ కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. రెండు సక్సెస్‌ అయితే వినాయక్‌ చిత్రాన్ని అంటే ఇంటిలిజెంట్‌ చిత్రాన్ని ఎక్కువ మంది చూసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.