ఏం లేదంటూనే గిఫ్ట్‌లు.. ఏదో ఉంది!

Anushka Shetty gave a special gift to Prabhas on his birthday.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల ప్రముఖ సినీ విశ్లేషకుడు ప్రభాస్‌, అనుష్కల మద్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని, తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇద్దరు చాలా డీప్‌ ప్రేమలో ఉన్నట్లుగా ట్వీట్‌ చేశాడు. త్వరలోనే వారిద్దరు వివాహం చేసుకోవడం ఖాయం అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ ట్వీట్‌తో రెండు మూడు రోజుల పాటు ప్రభాస్‌, అనుష్కల వివాహం గురించి పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చాయి. ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి రెండు మూడు సంవత్సరాల నుండి వస్తున్న వార్తలు నిజమే అని తేలిపోవడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ప్రభాస్‌ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు.

తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని, అంతకు మించి ఏమీ లేదని ప్రభాస్‌ చెప్పే ప్రయత్నం చేశాడు. అనుష్క మంచి స్నేహితురాలు అంటూ చెప్పిన ప్రభాస్‌ పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. కాని మరోసారి అనుమానాలు రేకెత్తేలా ఇద్దరు ప్రవర్తించారు. తాజాగా ప్రభాస్‌ తన 38వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెల్సిందే. ప్రభాస్‌ తన పుట్టిన రోజు సందర్బంగా పలువురు సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు అందుకున్నాడు. అయితే అనుష్క నుండి మాత్రం శుభాకాంక్షలతో పాటు, ఒక అరుదైన అందమైన గిఫ్ట్‌ను కూడా పొందాడు. ప్రభాస్‌ కోసం ప్రత్యేకంగా చాలా ఖర్చు పెట్టి అనుష్క ఈ వాచ్‌ను తయారు చేయించినట్లుగా తెలుస్తోంది.

ఇద్దరి మద్య ఏమీ లేనిది ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎంతో మంది స్నేహితులు ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు మాత్రమే చెప్పారు. కాని స్నేహితురాలు అయిన అనుష్క మాత్రం గిఫ్ట్‌ ఇవ్వడం చర్చనీయాంశం అవుతుంది. అనుష్క ఎందుకు గిఫ్ట్‌ ఇచ్చింది. అనుష్కకు ప్రభాస్‌ అంటే ఇష్టమా లేక ప్రేమా అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి గిఫ్ట్‌గా వాచ్‌ ఇవ్వడంతో ఇద్దరి మద్య ప్రేమ ఉందనే వార్తలు మళ్లీ జోరుగా వస్తున్నాయి. ఈ వార్తలకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి.