ఏపీలో రేపే టెన్త్ రిజల్ట్స్…మనవి చేసిన చంద్రబాబు

Kurnool Seats Declared By CBN

పదవ తరగతి ఫలితాలు రేపు అనగా 14-05-2019 వెలువడితాయి … ప్రతి సారి ఫలితాలు వచ్చినప్పుడు కొంత మంది విద్యార్థులు క్షణక ఆవేశంతో సూసైడ్ చేసుకోవడం ప్రతి సారి చూస్తున్నాం , మీరు మీ పిల్లలతో ముందుగానే మాట్లాడండి మార్క్స్ కంటే జీవితం చాలా గొప్పది , మార్క్స్ అనేవి కేవలం చదువు కున్న చదువులో ఒక భాగం మాత్రమేనని పిల్లలకు చేప్పండి, ఒక వేళ ఫెయిల్ అయితే మళ్ళీ పరిక్ష రాసుకోవడానికి ఛాస్స్ ఉంటుందని, జీవితంలో పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది గొప్పవాళ్ళు అయ్యారని సచిన్ స్టోరీ లాంటి ఉదహరణలు చెప్పండి. రోజంతా మీరు పిల్లలతో గడపండి , ఎన్ని మార్క్స్ వచ్చినా మీ పిల్లలను మెచ్చుకొండి. మనం చేసే ప్రతి పని మన పిల్లల కొసమే ఓకవేళ వారే లేకుంటే మన జీవితమే వ్యర్థమని గుర్తించండి. మనం ఎంత సంపాదించిన సంపాదన ఎవరి కోసం ? అందుకే ఈ ఒక్క గడియా మీ పిల్లల కోసం సమయం కేటాయించాండి. వారిని ఒంటరిగా వదిలేయకండి.
టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా వారికి మీ అండ అవసరం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మార్కులు తక్కువ వచ్చాయని వారిని పొరబాటున కూడా నిందించవద్దని, ఇతర పిల్లలతో పోల్చి అవమానకరంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. మార్కులు సరిగా రాని పిల్లలను దూషించడం ద్వారా వాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు పిల్లల తెలివితేటలకు కొలమానాలు కాదని, కిందపడినా రెట్టించిన ఉత్సాహంతో పైకిలేచే కడలి అలలను స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మళ్లీ ప్రయత్నం చేయడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చంటూ పిల్లల్లో ప్రేరణ కలిగించాలని తల్లిదండ్రులకు సూచించారు. మార్కులు సరిగారాని పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.