ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. 2024 తర్వాత తాను రాజకీయాలలో ఉండను అన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘‘42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఏపీలో బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.. నేను పదవులు ఆశించి పని చేయలేదు. నాకు సీఎం అవ్వాలని లేదు’’ అన్నారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘‘2014 ఎన్నికల సమయంలోనే నాకు రాజమండ్రి సీటుతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారు. కానీ నేను ఇష్టపడకపోతే ఆకుల సత్యనారాయణకి అవకాశం దక్కింది. నేను బీజేపీ కార్యకర్తని… పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నాను. డిసెంబర్ మూడున ‘దివ్య కాశీ.. భవ్య కాశీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాశీ క్షేత్రం రూపురేఖలను ప్రధాని మోదీ పూర్తిగా మార్చారు.. కాశీ క్షేత్రం అభివృద్ది కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించే సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని అన్ని మండలాలలో స్క్రీన్ ల ద్వారా ప్రదర్శిస్తాం’’ అని తెలిపారు