2018-19 ఏపీ బ‌డ్జెట్ వివ‌రాలు…

Ap budget 2018-19 details
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2018-19 సంవ‌త్సరానికి గానూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అసెంబ్లీ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టింది. రూ. 1,91,063.61 కోట్ల‌తో ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. బ‌డ్జెట్ ప్ర‌సంగంలో విభ‌జ‌న బాధిత ఏపీ సాగుతున్న తీరును య‌న‌మ‌ల వివ‌రించారు. రాష్ట్ర పున‌ర్ నిర్మాణానికి సాయం అంద‌డం లేద‌ని, విభ‌జ‌న‌లో రాజ‌ధానిని, ఆదాయాన్ని కోల్పోవ‌డం రాష్ట్రానికి తీర‌ని న‌ష్టాన్ని క‌లిగించింద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అస‌మంజ‌సంగా జ‌రిగిన విభ‌జ‌న వ‌ల్ల రాష్ట్రానికి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయని, కేంద్రం నుంచి స‌కాలంలో అంద‌నిసాయం స‌మ‌స్యను మ‌రింత జ‌టిలం చేసింద‌ని తెలిపారు. సంక్షోభాల‌ను అవ‌కాశాలుగా మ‌లుచుకుని ముందుకు వెళ్తున్నామ‌ని, కేంద్రం ఉదాసీన‌త క‌న‌బ‌ర్చ‌క‌పోతే మ‌రింత వృద్ధి, ప్ర‌గ‌తి సాధ్య‌మ‌య్యేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మూడేళ్ల‌లో జాతీయ స‌గ‌టు వృద్ధి 7.30తో పోలిస్తే రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిద‌ని తెలిపారు. నిస్పృహ నుంచి ఆశ‌, భ్ర‌మ‌ల నుంచి విశ్వాసం, నిరాద‌ర‌ణ నుంచి అభివృద్ధి దిశ‌గా రాష్ట్రం ప‌య‌నం సాగిస్తోంద‌ని య‌న‌మ‌ల వివ‌రించారు. అనంత‌రం బ‌డ్జెట్ లో వివిధ రంగాల‌కు జ‌రిపిన కేటాయింపులు వివ‌రించారు. రూ. 1,91,063.61 కోట్ల బ‌డ్జెట్ లో రెవెన్యూ వ్య‌యం రూ. 1,50, 270.99కోట్లు కాగా… మూల‌ధ‌న వ్య‌యం రూ. 28.678.49 కోట్లు. గ‌తంతో పోలిస్తే బ‌డ్జెట్ 21.70శాతం పెరిగింది.

రంగాల‌వారీగా కేటాయింపులు చూస్తే

వ్య‌వ‌సాయ రంగానికి రూ. 12,355.32కోట్లు
సాగునీటి రంగానికి రూ. 16,978.23 కోట్లు
ఇంధ‌న రంగానికి రూ. 5,052.54కోట్లు
సంక్షేమ రంగానికి రూ. 13,720 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ. 20,815.98 కోట్లు
మ‌త్స్య‌కారుల అభివృద్ధికి రూ. 77 కోట్లు
న్యాయ‌శాఖ‌కు రూ. 886 కోట్లు
విద్యాశాఖ‌కు రూ. 24,185 కోట్లు
సాంకేతిక విద్య‌కు రూ. 818 కోట్లు
ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 3,074.87 కోట్లు
ర‌వాణా శాఖ‌కు రూ. 4,653 కోట్లు
గృహ‌నిర్మాణ శాఖ‌కు రూ. 3,679 కోట్లు
పోల‌వ‌రం ప్రాజెక్టుకు రూ. 9,000 కోట్లు
రైతురుణ‌మాఫీకి రూ. 4,100 కోట్లు
క్రీడ‌లు, యువ‌జ‌న సేవ‌ల శాఖ‌కు రూ. 1,635.44 కోట్లు
క‌ళ‌, సాంస్కృతిక రంగానికి రూ. 94.98కోట్లు
స‌మాచార, పౌర సంబంధాల శాఖ‌కు రూ. 22.481కోట్లు
కార్మిక‌, ఉపాధిక‌ల్ప‌న‌కు రూ. 902.191కోట్లు
చ‌ర్మ‌కారుల జీవ‌నోపాధికోసం రూ. 60 కోట్లు
మెగా సీడ్ పార్క్ కోసం రూ. 100 కోట్లు
ఈ ప్ర‌గ‌తికి రూ. 200 కోట్లు
గృహ‌నిర్మాణం- భూసేక‌ర‌ణ‌కు రూ. 575 కోట్లు
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు రూ. 1,168 కోట్లు
స్వ‌చ్ఛ భార‌త్ కు రూ. 1,450 కోట్లు
హోంశాఖ‌కు రూ. 6,226 కోట్లు
ప‌ర్యాట‌క శాఖ‌కు రూ. 290 కోట్లు
చేనేత‌ల‌ను ప్రోత్స‌హించేందుకు జ‌న‌తా వ‌స్త్రాల ప‌థ‌కం కింద రూ. 250 కోట్లు
జ‌న‌తా వ‌స్త్రాల స‌ర‌ఫ‌రా కోసం రూ.200 కోట్లు
క‌ల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రూ. 70 కోట్లు
చేతివృత్తులకు ఆద‌ర‌ణ ప‌థ‌కానికి రూ. 750 కోట్లు
చంద్ర‌న్న పెళ్లికానుక కింద ఎస్సీల‌కు రూ. 100 కోట్లు, బీసీల‌కు రూ. 100 కోట్లు
సామాజిక భ‌ద్ర‌త‌కోసం రూ. 3,029 కోట్లు
కాపు సామాజిక విద్యార్థుల‌కు రూ. 400 కోట్లు
ఫైబ‌ర్ గ్రిడ్ కు రూ. 600 కోట్లు
అన్నా క్యాంటిన్ల‌కు రూ. 200 కోట్లు
స్టార్ట‌ప్ ల‌కు రూ. 100 కోట్లు.
ఎన్టీఆర్ జ‌ల‌సిరికి రూ. 100 కోట్లు
డ్వాక్రా మ‌హిళ‌ల‌కు శానిట‌రీ న్యాప్ కిన్ల కోసం రూ. 100 కోట్లు
వారానికి ఐదురోజులు గుడ్లు ప‌థ‌కానికి రూ. 266 కోట్లు
పౌష్టికాహార లోపం నియంత్ర‌ణ‌కు రూ. 360 కోట్లు
హిజ్రాల సంక్షేమానికి రూ. 20కోట్లు
నిరుద్యోగ భృతికి రూ. వెయ్యికోట్లు
ఎన్టీఆర్ పింఛ‌న్లుకు రూ. 5,000కోట్లు
ఎన్టీఆర్ ఆరోగ్య సేవ‌కు రూ. వెయ్యికోట్లు
ఈబీసీల ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ రూ. 700 కోట్లు
ఎంబీసీల ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ రూ. 100 కోట్లు
సీఆర్ డీఏకు రూ. 7,761కోట్లు బ‌డ్జెట్ లో కేటాయింపులు జ‌రిపారు.