AP రాజధాని అమరావతి పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని ఎదురుచూస్తున్న వేళ కీలక అప్టేట్ వచ్చేసింది. మార్చి 15 నుంచి రాజధాని పనులు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30 వేల మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యం అయ్యింది. టెండర్లు పిలుచుకోవచ్చు కానీ ఖరారు చేయవద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.