దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తు ప్రాణాలు కోల్పోయారు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన సైనికుడు మురళీనాయక్. ఇక ఆయన మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణలో సైనికుడు మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఆయన అన్నారు. ఈ మేరకు తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీనాయక్‌కు నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ఆయన తెలిపారు.
